రేయ్ చంపేస్తా.. వార్నింగ్ ఇచ్చిన రోజా..?
ఇక ఈ మధ్య కాలంలో ఇమాన్యుయల్ పంచుతున్న కామెడీ కాస్త బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అందరు టీం లీడర్లు కూడా తమ టీంలో ఇమాన్యుయల్ ద్వారా కామెడీ చేయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో జబర్దస్త్ లోని ప్రతి టీమ్ స్కిట్ లో కూడా ఇమాన్యుయల్ కనిపిస్తున్నాడు. ఇక ఇటీవలే జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా జబర్దస్త్ స్కిట్ లో భాగంగా ఎంతోమంది కమెడియన్స్ యాంకర్ అనసూయ పై లేదా జడ్జీల పై పంచులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
కొన్ని సార్లు జడ్జీలు కూడా అటు స్కిట్ లో భాగంగా ఊహించనివిధంగా పంచులు వేస్తూ ఉంటారు. ఇక ఇటీవలే విడుదలైన ప్రోమో లో భాగంగా ఇమాన్యుయల్ స్కిట్ చేస్తున్న సమయంలో రాఘవేంద్రరావు ఒకవేళ హీరోల బొడ్డుపై పళ్ళు వేయాలంటే ఇప్పటికే నా బొడ్డ పై ఎన్నో పళ్ళు పడేవి అంటూ ఇమాన్యుయల్ చెప్తాడు. మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం కులం అనే పాటలో రాఘవేంద్ర రావు చూపించిన బొడ్డు ఎవరిదో తెలుసా నాదే అంటూ చెబుతాడు అంతేకాకుండా భైరవద్వీపం సినిమా లో హీరోయిన్ గురించి తెలుసా అంటూ డైలాగ్ చెబుతున్న సమయంలో జడ్జి రోజా వెంటనే అందుకొని రేయ్ చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే జడ్జి రోజా భైరవద్వీపం సినిమా లో హీరోయిన్ గా నటించింది.