మోనాల్ ను వదిలేలా లేని నాగార్జున.. భారీ ఆఫర్..?

shami
బిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది కంటెస్టంట్ గా వచ్చింది మోనాల్ గజ్జర్. హౌజ్ లో చాలా సెన్సిటివ్ మెంబర్ గా ఉన్న ఆమె అసలు ఇన్ని వారాలు ఉంటుందని మాత్రం ఎవరు ఊహించలేదు. ఏదో ఒక నాలుగు వారాల్లో ఆమె హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కాని అఖిల్, అభిజిత్ లతో ఆమె క్లోజ్ అవడం.. అఖిల్ తో ట్రాక్ నడిపించడం ఆమె మైలేజ్ పెంచింది. హౌజ్ లో అందరితో పాటు నామినేషన్స్ లో ఉంటూ ప్రతివారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని వార్తలు రావడం ఆమె సేఫ్ అవడం ఇలానే జరుగుతుంది.
12వ వారం కూడా మోనాల్ ను మొదట సేఫ్ చేసి మిగతా హౌజ్ మేట్స్ గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేశాడు బిగ్ బాస్. ఇదిలాఉంటే చివరి వారాల్లో మోనాల్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇక మోనాల్ గ్రాఫ్ చూసిన నాగార్జున ఆమెకు సినిమా ఛాన్స్ ఇస్తున్నట్టు టాక్. తెలుగులో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది మోనాల్ గజ్జర్. అందుకే ఆమెకి ఇక్కడ ఐడెంటిటీ సంపాదించుకుంది.
సినిమా ఛాన్సులు సన్నగిల్లే సరికి బిగ్ బాస్ తో సత్తా చాటాలని వచ్చింది. అయితే బిగ్ బాస్ లో 13 వారాల పాటుగా అలరించిన మోనాల్ గజ్జర్ మరో మూడు వారాలు కూడా ఉండి ఫైనల్స్ కు చేరుతుందో లేదో చూడాలి. బయటకు వచ్చాక మోనాల్ కు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ల్ఫ్ మాత్రం ఛాన్స్ రెడీగా ఉందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: