మెగా బ్రదర్ ఏకైక కూమార్తె నిహారిక పెళ్లి సందడి షురూ అయ్యిందండోయ్. దాంతో మెగా ఫ్యామిలీలో పార్టీలు కూడా ఓ ఊపు అందుకుంటున్నాయి. రీసెంట్ గా మెగా ఆడపడుచులంతా నిహారికతో కలిసి ఓ పార్టీని కూడా చేసుకున్నాట. దీనితో పాటుగా నిహారిక కూడా తన ఫ్రెడ్స్ తో పార్టీలు బాగానే చేసుకుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా కాబోయే భార్యాభర్తలిద్దరికీ ఓ సర్ ప్రైజ్ పార్టీని కూడా ఇచ్చారట. ఇది మెగా ఫ్యామిలీకి కాబోయే అల్లుడు చైతన్యను ఆహ్వానిస్తూ సుస్మిత, శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఈ పార్టీతో వారిని ఆహ్వానించారట. ఈ వేడక కనుల విందుగా జరిగిందంటూ మెగా ఫ్యామిలీ చెప్పుకుంటున్నారు.
అయితే ఈ వేడుకలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్ వైఫ్ స్నేహ, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, వెంకటేష్ దంపతులు ఈ వేడుకలో పాల్గొని సందడి సందడి చేశారు. ఎంతో కనుల విందుగా జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తాజాగా కళ్యాణ్ దేవ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ‘#NisChay వేడుకలు ప్రారంభమయ్యాయంటూ, రాత్రి జరిగిన ఈ పార్టీ చాలా సంతోషంగా జరిగిందన్నారు ఆయన. అలాగే ఈ పార్టీ నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాకు ఇన్ని తీపి గుర్తులను ఇచ్చిన శ్రీజ, సుస్మితలకు అలాగే వరుడు చైతన్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేశారు. ఈ అందమైన ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసిని మెగా అభిమానులు, నెటిజన్లు కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఎక్కడా.. వారెందుకు లేరంటూ కామెంట్లు చేస్తున్నారు. వారు ఈ ఫంక్షన్ కు రాకపోవడానికి కారణాలేంటని తెగ కామెంట్లు పెడుతున్నారు. షూటింగ్ లో ఉన్నారా లేక ఇతర కారణమేదైనా ఉందా అంటూ ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.