శ్రద్ధా, కియారా లకు ఆసక్తి ఉందట .... కానీ .....??
ఇక మంచి అంచనాలతో రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుని తెలుగులో ఫస్ట్ సినిమాతోనే కియారా అద్వానీకి గొప్ప క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక దాని తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా నటించిన సినిమా వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తరువాత కియారా పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక తెలుగు తెరకి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్.
అంతకముందు బాలీవుడ్ లో ఆషికి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రద్ధ, ఆపై హిందీలో పలు సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకున్నారు. అనంతరం రెబల్ స్టార్ ప్రక్కన ఛాన్స్ రావడంతో సాహోలో నటించారు. అయితే ఆ సినిమా తెలుగులో యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ అటు నార్త్ లో మాత్రం సూపర్ గా దూసుకెళ్లింది. ఇకపోతే ఈ ఇద్దరు భామలు కూడా మరొక్కసారి సౌత్ సినిమాలు చేయకపోవడంతో వీరు ఇక్కడి చిత్ర పరిశ్రమపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి , ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా తెలుగు సహా పలు సౌత్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, నిజానికి ఇటీవల పలు సినిమాల కథలు వారి వద్దకు వచ్చినప్పటికీ, అవి తాము ఆశించిన రేంజ్ లో లేకపోవడంతోనే వీరిద్దరూ ఆ సినిమాలు చేయలేదని అంటున్నారు. మంచి అవకాశం వస్తే తప్పకుండా ఎప్పుడైనా సౌత్ సినిమాలు చేయడానికి తాము సిద్ధం అని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు చెప్తున్నారట....!!