పవన్ కి ఎదురుపడనున్న ప్రకాష్ రాజ్.... రాజకీయం రూటు మార్చేనా..?

VAMSI
ఇటీవలే  ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, రాజకీయాల్లో పలు పార్టీల గురించి  తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. పవన్ నిర్ణయాలకు స్థిరత్వం ఉండదని ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి అని.. ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.  అంతేకాదు గ్రేటర్ ఎన్నికలలోనూ పవన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు ప్రకాష్ రాజ్. ఇటు కేసిఆర్ ను సపోర్ట్ చేస్తూ బీజేపీని దుమ్ము దులిపేశాడు.
అలా పవర్ స్టార్ ను పెద్ద ఎత్తున విమర్శించగా ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేతనే అన్ని మాటలు అంటావా అంటూ ఫైర్ అయ్యి... ప్రకాష్ రాజ్ పై మాటల తూటాలు పేల్చారు పవన్ కళ్యాణ్  అన్నయ్య నాగబాబు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం... ఇంతవరకు ఈ విషయంపై బహిరంగంగా స్పందించలేదు. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా  షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే...ఇందులో పవన్.. అరాచకుల చేతిలో అన్యాయానికి గురైన అమ్మాయిల వైపు వాదించే లాయర్ పాత్ర చేస్తుండగా.... ప్రకాష్ రాజ్ విలన్లకు మద్దతుగా నిలిచే లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.
 వీళ్లిద్దరిపై తర్వాత షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. మరి త్వరలో ఎదురు పడనున్న ప్రకాష్ రాజ్ పై పవన్ ఎలా స్పందించనున్నారు...?? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలు చర్చకు వస్తే  పరిస్థితి పీక్స్ కు చేరుతుందేమో  చెప్పలేం.... ఓ రేంజ్ లో తనను విమర్శించిన ప్రకాష్ రాజ్ కు పవన్ ఎలా సమాధానం ఇవ్వనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: