అభిజిత్ ను కార్నర్ చేసిన బిగ్ బాస్.. అసలేం జరుగుతుంది..?

shami
బిగ్ బాస్ సీజన్ 4లో బయట అభిజిత్ కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అతను మైండ్ గేం ఆడియెన్స్ కు నచ్చినా అభిజిత్ ఓటింగ్ విషయంలో ఏదో మతలబు జరుగుతుంది అన్నది కొందరు వాదన. ఏది ఎలా ఉన్నా ఓటింగ్స్ ఎవరికి ఎక్కువ వస్తే వారే విన్నర్. బయట ఆడియెన్స్ లో ఉన్న అభిజిత్ ఫాలోయింగ్ ను తగ్గించే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. అందుకే డెయ్యం టాస్క్ లో అభిజిత్ ను వరస్ట్ పర్ఫార్మర్ గా ఏకంగా బిగ్ బాస్ ఎంపిక చేశాడు.
మోనాల్ తో డేట్ కు వెళ్లే టాస్క్ లో అభిజిత్ బిగ్ బాస్ చెప్పినా సరే లైట్ తీసుకున్నాడు అందుకే బిగ్ బాస్ డైరెక్ట్ గా అభిజిత్ ను వరస్ట్ పర్ఫార్మర్ గా ఎంపిక చేసాడు. అయితే దానీకి అభిజిత్ కూడా ఓకే అన్నాడు. ఓ పక్క బయట తనకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే విజేత అతనే అయ్యేలా ఉన్నాడని అంటున్నారు. టాప్ 2లో ఉన్న వారిలో ఆడియెన్స్ ఓటింగ్ తో పాటుగా బిగ్ బాస్ టీం నిర్ణయించిన వారికే టైటిల్ వస్తుంది.
అందుకే బిగ్ బాస్ అభిజిత్ ను కార్నర్ చేశాడని అంటున్నారు. మరి ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పుడో లెక్క కాబట్టి ఈ మూడు వారాలు ఆట బాగా ఆడితే మాత్రం విన్నర్ గా నిలిచే అవకాశం ఉంటుంది. బయట ఫాలోయింగ్ అభిజిత్ కు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నా మరో ఇద్దరు కంటెస్టంట్స్ కు కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది.                                                             
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: