అల్లు అర్జున్ 'రాజకీయం'.. మాస్టర్ ప్లాన్ అదిరింది బాసు..!

shami
అల వైకుంఠపురములో హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో మొదలు పెడతారని తెలుస్తుంది.
2022 సమార్ రిలీజ్ టార్గెట్ పెట్టుకుంటారట. మిర్చి నుండి రాబోయే ఆచార్య వరకు తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా జాగ్రత్త పడుతున్న కొరటాల శివ ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ ఇస్తాడని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ రాజకీయ నేతగా చూపిస్తారని తెలుస్తుంది. స్టూడెంట్ లీడర్ గా అల్లు అర్జున్ కనిపిస్తారట. బన్నీ కెరియర్ లో పొలిటీషియన్ గా చేసిన పాత్ర ఏది లేదు.
మహేష్ తో ఆల్రెడీ భరత్ అనే నేను సినిమా చేశాడు కొరటాల శివ. అయితే అల్లు అర్జున్ తో తీసే సినిమా కూడా భరత్ అనే నేను తరహాలోనే ఉంటుందా లేక మరో విధంగా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ క్రేజీ భామ ఒకరిని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. పుష్ప ఎలాగు పాన్ ఇండియా మూవీగా వస్తుంది కాబట్టి ఈ సినిమాను కూడా ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.                                                    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: