సమంత షోకి ఈసారి దగ్గుబాటి హీరో.. సూపరో సూపర్..!

shami
స్టార్ హీరోయిన్ సమంత ఆహా ఓటిటిలో చేస్తున్న క్రేజీ టాక్ షో సామ్ జామ్. ఈ షో మొదటి ఎపిసోడ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాగా.. ఈ షోకి సెకండ్ గెస్ట్ గా దగ్గుబాటి హీరో భళ్లాలదేవ రానా వచ్చాడు. రానా ఒక్కడే వస్తే కిక్ ఏముంది అనుకున్నారో ఏమో అతనితో పాటుగా మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ కూడా సాం జాం షోలో పాల్గొన్నాడు.
విజయ్ దేవరకొండ తో జరిపిన సామ్ జామ్ మొదటి ఎపిసోడ్ సూపర్ హిట్ అవగా ఇప్పుడు రానాతో ప్లాన్ చేసిన సెకండ్ ఎపిసోడ్ కూడా కొత్తగా ఉండబోతుంది. సమంత అడిగే చిలిపి ప్రశ్నలకు గెస్టులుగా వచ్చే స్టార్స్ చెప్పే క్రేజీ ఆన్సర్స్ షోని పాపులర్ అయ్యేలా చేస్తున్నాయి. ప్రస్తుతం రానా అరణ్య సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న విరాటపర్వం సినిమా కూడా పూర్తి కాబోతుంది.
విరాటపర్వం సినిమా విశేషాలతో పాటుగా ఇంకా తన ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ గురించిన విషయాలతో సమంత టాక్ షో జరుగనుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ కు సంబందించిన టీజర్ వస్తుందని తెలుస్తుంది. సమంతతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదని ప్రోమోతో సర్ ప్రైజ్ చేసిన సమంత ఈ టాక్ షోతో తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సమంత కూడా జాను సినిమా తర్వాత తెలుగులో ఒక్క సినిమా కమిటవలేదు. అయితే ఈ గ్యాప్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసిన అమ్మడు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా తన సత్తా చాటుతుంది.                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: