రాధేశ్యామ్ ఫస్ట్ సాంగ్ అప్పుడే ..... యూత్ ని ఇట్టే పట్టేస్తుందట .....??
ఇటీవలే ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. దీనితో సినిమా 90 శాతానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో మిగతా షూటింగ్ ని హైదరాబాద్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇకపోతే ఇటీవల ప్రభాస్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించడంతోపాటు అది సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా క్రియేట్ చేసింది.
అయితే ఈ సినిమా విషయమై లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ జనవరి 1న నూతన సంవత్సర కానుకగా రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు. మంచి మెలోడీయస్ గా రొమాంటిక్ స్టైల్ లో సాగే ఈ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఎంతో అద్భుతంగా ట్యూన్ చేశాడని యువత మనసుని ఎంతో ఆకట్టుకునేలా సాగనున్న ఈ సాంగ్ లో ప్రభాస్, పూజా హెగ్డే ల జోడి అదిరిపోతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్త గనుక నిజమైతే మాత్రం ఇది నిజంగా ప్రభాస్ ఫాన్స్ కి అతి పెద్ద పండుగ అని చెప్పక తప్పదు.....!!