దటీజ్ బాలయ్య...! ట్రోల్ చేసిన నోళ్లు ఇప్పుడేమంటాయి ?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....సీనియర్ హీరో నటసింహం బాలకృష్ణకి  కోపం చాలా ఎక్కువ అని అంటుంటారు.కాని ఆయన చాలా మంచివాడు. అది అర్ధం చేసుకోలేని కొందరు మీమర్స్  ఆయన  ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే చాలు అంతా ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు.దాన్ని పట్టుకుని ఇక మీమ్స్ తో నెగటివిటీ ని స్ప్రెడ్ చేస్తారు.సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ చేస్తుంటారు. ఇక కొంత మంది అయితే బాలయ్యను ఎగతాళి కూడా చేస్తారు. తాజాగా ఇలాంటి ఎగతాళి కార్యక్రమం ఒకటి సోషల్ మీడియాలో జరిగింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో హర్ష్ కనుమిల్లి ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. అయితే, ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే బాలకృష్ణ మ్యానరిజంపై సోషల్ మీడియాలో వెటకారం మొదలైపోయింది. హీరో హర్ష్‌పై బాలకృష్ణ చేయి చేసుకున్నారని, నిర్మాత అద్వయపై ఆగ్రహం వ్యక్తం చేశారని, తన ఫోన్‌ను బాలయ్య విసిరి కొట్టారని మీమ్స్ సోషల్ మీడియాలో హల్ ‌చల్ చేశాయి.


సాధారణంగా బాలయ్య ఎప్పుడూ ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటారని పేరుంది కాబట్టి ఇది కూడా నిజమైపోయిండని భావించారు. కానీ, హర్ష్‌పై బాలయ్య చేయి చేసుకోలేదు. ఈ విషయాన్ని హర్ష్ స్వయంగా వెల్లడించారు. తన స్నేహితులతో కలిసి ఒక  మీటింగ్‌లో పాల్గొన్న హర్ష్.. బాలయ్యపై మొదలైన మీమ్స్ గురించి వివరణ ఇచ్చారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు తాను పోస్టర్‌ను ఎడమ చేతితో పట్టుకున్నానని, అందుకుని ఆ చేయి మీద బాలయ్య చిన్నగా కొట్టి కుడి చేతితో పట్టుకోమని చెప్పారని, ఈ మాత్రం దానికి రకరకాల సౌండ్లతో మీమ్స్ వచ్చేశాయని హర్ష్ వివరించారు.
అలాగే, బాలయ్య ఫోన్ విసిరిన ఘటనపై కూడా హర్ష్ స్పందించారు.


‘‘కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు బాలయ్య తన కళ్లద్దాలు తీసి అసిస్టెంట్‌ పైకి విసిరారు. ఆయన పట్టుకున్నాడు. కరెక్ట్‌గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసే సమయంలో ఫోన్ రావడంతో దాన్ని కూడా తన అసిస్టెంట్ పట్టుకుంటాడనే ఆయన విసిరినట్టున్నారు’’ అని వివరణ ఇచ్చారు. మొత్తం మీద తననైతే బాలయ్య కొట్టలేదని ఆ మీమ్స్‌కు హర్ష్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు.కాబట్టి ఇప్పుడు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన మీమర్స్ ఇప్పుడు బాలయ్య నిజ స్వరూపం తెలుసుకొని ఏమంటారో..ఇదండి అసలు జరిగిన మేటర్ ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: