మదర్స్ ఎపిసోడ్ బిగ్ బాస్ చరిత్రలోనే బెస్ట్ ఎపిసోడ్ అట...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిగ్ బాస్ ప్రతి సీజన్ లోనూ హౌస్ మేట్స్ ని పలకరించేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తూనే ఉంటారు.ఇక ఇప్పుడు దాకా జరిగిన సీజన్లు చూసుకున్నట్లయితే  మొదటి సీజన్లో ఆదర్ష్ భార్య ,కొడుకు అలాగే  శివబాలాజీ భార్య , అర్చన మదర్ ఇలా అందరూ కూడా వచ్చి పలకరించారు. తర్వాత సీజన్ లో కౌషల్ వైఫ్, పాప, గీతామాధురి హస్బెండ్, తనీష్ బ్రదర్ ఇలా అందరూ వచ్చి  భావోద్వేగానికి గురి చేశారు. తర్వాత సీజన్ 3 లో శ్రీముఖి మదర్, రాహుల్ మదర్, బాబాభాస్కర్ కుటుంబం , శివజ్యోతి భర్త  వచ్చినపుడు కూడా ఎమోషనల్ గా ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయి.

ఈసారి సీజన్ లో ఇలాగే తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపాడు బిగ్ బాస్. అయితే, కోవిడ్ కారణాలవల్ల గ్లాస్ డోర్ రూమ్ లో నుంచే ఈసారి హౌస్ మేట్స్ ని వాళ్ళ కుటుంబ సభ్యులు  పలకరించాల్సి వచ్చింది. అంతేకాదు, పర్సనల్ గా కానీ, లేదా విడిగా కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఫస్ట్ అఖిల్ మదర్ వచ్చి బాగా ఫన్ చేశారు. తర్వాత అభిజిత్ మదర్ అయితే ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. హౌస్ లో కొట్టుకోండి…, అంటూ అంటూ అదే కదా మజా అంటూ సరదాగా మాట్లాడి ఎంతగానో ఆకట్టుకున్నారు. తర్వాత హారిక మదర్ కూడా వచ్చి  హారికకి మంచి  ధైర్యం చెప్పారు.

ఇక అవినాష్ వాళ్ల మదర్ నడవలేకపోయినా కూడా కొడుకుకోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది. దానికి అవినాష్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఇలా ఫస్ట్ డే కేవలం మదర్స్ ని మాత్రమే పంపించి మురిపించాడు బిగ్ బాస్. మదర్ అంటే మదరే అంటూ హౌస్ మేట్స్ ఫీల్ అయ్యేలా చేశాడు. ఇక్కడే హౌస్ మేట్స్ అందరూ కూడా అభిజిత్ మదర్ చెప్పిన మాటల్ని బాగా వంటబట్టించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ లో జరిగింది గేమ్ లోనే మర్చిపోదాం అంటూ ఒక టీమ్ గా కలిసి సందడి చేశారు. అందరూ కలిసి బిగ్ బాస్ బిగ్ బాస్ అంటూ గట్టిగా అరసి మంచిగా గ్రూప్ హాగ్ ఇచ్చుకొని చాలా సంతోషపడ్డారు.ఈ ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది..ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: