ఆహా బ్రాండ్ వ్యాల్యూ పెంచే పనిలో బన్నీ...!

VAMSI
తండ్రి బాటలో నడుస్తున్న తనయుడు. గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకొని  సినిమాలతో దూసుకుపోతున్నారు మెగా అల్లుడు అల్లు అర్జున్. దీంతో పాటు  గ్రేట్ డాన్సర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తూ... ఫుల్ జోష్ తో కెరియర్ కొనసాగిస్తున్నారు ఈ అల్లువారి హీరో. అయితే ఇప్పుడు తండ్రి కోసం డిజిటల్ రంగంలో అడుగు పెట్టి *ఆహా* అనిపించుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలో అన్ని రంగాలతోపాటు సినీ రంగం కూడా పెద్ద ఎత్తున కుంగిపోయింది. థియేటర్లన్నీ మూతపడ్డాయి. కొంత గ్యాప్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభమై సినిమాలు కంప్లీట్ అయినా... విడుదల చేసేందుకు థియేటర్లు సిద్ధంగా లేకపోవడంతో.... చాలామంది  నా ఓటీటీ దారిన పడ్డారు.

 ఇప్పటికే ఎన్నో సినిమాలు పోటీ వేదికపై రిలీజ్ అయ్యి తమ హవా చాటుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఇటు ఓ టి టి వేదికలకు అటు బుల్లితెర టీవీ రంగానికి బాగానే ఆదరణ లభించింది.. అందులోనూ ఖర్చు తక్కువ మరియు ఇంటిల్లపాది ఒకే దగ్గర కూర్చొని ఎంతో సౌకర్యంగా వారు అనుకున్న వినోద కార్యక్రమాలను లేదా సినిమాలను చూసే అవకాశం ఉండడంతో ఈ వేదికకు మరింత క్రేజ్ పెరిగింది. అలాగే చాలా మంది నిర్మాతలు  సొంత ఓటీటీ వేదికలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఓటీటీ వేదికపై ఆహా యాప్ ను ప్రారంభించి సంచలనం సృష్టించారు అల్లుఅరవింద్. అందులోనూ టాలీవుడ్లోనే తొలుత ఆహా వంటి యాప్ ను ప్రారంభించిన ఘనత అల్లు అరవింద్ కి దక్కింది.

 ఇదే సమయంలో స్మార్ట్ వీక్షణ  యాప్ అంతకంతకు పెంచేందుకు....ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్ల శిష్యుల్ని యువ డైరెక్టర్లను పిలిచి అవకాశాలు ఇచ్చి మరీ  వెబ్ కంటెంట్ డైరెక్ట్ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తూ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతతో రియాలిటీ షోలు ప్లాన్ చేశారు. దేవరకొండ సహా పలువురు హీరోలు ఈ వేదిక ప్రమోషన్ కి తమ వంతు ప్రయత్నాలు చేస్తుండగా.... తన తనయుడు అయితే మరింత ఫాలోయింగ్ పెంచుతాడు ఏమో..!! అనుకున్నారో ఏమో గాని....ఇప్పుడు ఏకంగా అల్లు అరవింద్ వారసుడు అయిన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగి ఆహా బ్రాండ్ కు మరింత క్రేజ్  పెంచే పనిలో పడ్డారట. అందులోనూ బన్నీ నే స్వయంగా నిర్మాతగా మారి కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికిగాను సొంతంగా ఓ బ్యానర్ నే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీటికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తండ్రి బాటలో నడుస్తూ ఆయన ప్రారంభించిన ఆహా తెలుగు ఓ టి టి లో తను కూడా పాలుపంచుకుంటున్నారు బన్ని. ఇక మెగా అల్లుడు అడుగు పెట్టాక మెరుపులు తప్పవంటున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: