సూర్య జోరు మాములుగా లేదుగా.. లైన్లో పది సినిమాలట..!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్టార్ హీరో సూర్య ఎలాంటి నటుడో సౌత్ ఇండియా మొత్తం తెలిసిందే.. అతని యాక్టింగ్, లుక్స్ కథలు ఎంచుకునే విధానం సూపర్ గా ఉంటాయి. ఇక సూర్య ఎప్పుడు రొటీన్ కథలు కాకుండా నటనకు ప్రాధాన్యత వున్న సినిమాలానే ఎప్పుడు ఎంచుకుంటాడు. ‘ఎన్జీకే’ ‘బందోబస్త్’ వంటి సినిమాలు బాగున్నా కాని  సూర్య క్రేజ్ ను బాగా దెబ్బ . కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా ఆ సినిమాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా రూపంలో అల్టిమేట్  హిట్ దొరికింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్లోనే విడుదల చేశారు.


ఎయిర్‌ డెక్కన్‌ సంస్థ అధినేత అయిన జీ.ఆర్.‌గోపీనాథ్‌ ‘సింప్లి ఫ్లై’ అనే బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించింది సుధా కొంగర.సూర్య అద్భుతమైన నటన, దర్శకురాలు టేకింగ్ ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. దర్శకురాలు సుధా కొంగర అయితే.. ‘మణిరత్నంను మించిన  శిష్యురాలు అనిపించుకుంది’ అనే ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ చిత్రం తరువాత సూర్య 10 సినిమాలను లైన్లో పెట్టాడట. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.అందులో తన భార్య జ్యోతికతో మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్లాన్ చేసాడట.


అంతేకాకుండా తాను హీరోగా నటించబోతున్న సినిమాలు అలాగే.. వేరే హీరోలతో నిర్మించబోయే సినిమాలు.. ఇలా మొత్తం కలిపి 10సినిమాలను లైన్లో పెట్టాడట సూర్య. ఇదంతా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా హిట్ ఇచ్చిన ఇంపాక్టే అని స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: