మాటల మాంత్రికుడి తో చరణ్ సినిమా ఫిక్స్ .... డీటెయిల్స్ ఇవే .... ??

GVK Writings
మొదటగా చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హీరో గా గొప్ప క్రేజ్, పాపులారిటీ సంపాదించారు. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో పాటు మంచి విజయాలు దక్కించుకున్న రామ్ చరణ్ రెండేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రౌద్రం రణం రుధిరం. తొలిసారిగా తన మిత్రుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే దీంతో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య లో కూడా ఒక స్పెషల్ రోల్ చేయనున్నారు చరణ్. ఇక వీటి అనంతరం చరణ్ నటించబోయే తదుపరి సినిమ గురించి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ్ చరణ్ కొత్త సినిమా చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తో తన  తదుపరి సినిమా ప్రకటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆపై మహేష్ బాబు తో ఒక సినిమా చేయనున్నారని దాని అనంతరమే చరణ్ తో సినిమా చేస్తానని అంటున్నారు.

ఇటీవల రామ్ చరణ్ కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ ని ఆయనకు వినిపించిన త్రివిక్రమ్ అతి త్వరలో  దీని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయనున్నారని అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత మరొక స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయనున్న చరణ్ ఆ సినిమా పూర్తయిన అనంతరం త్రివిక్రమ్ సినిమా చేస్తారని కాగా ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: