సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరో విజయ్ అని రుజువు అయ్యింది... ఇదే ప్రూఫ్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కోలీవుడ్‌ స్టార్‌ హీరో తలపతి విజయ్‌ సౌత్ ఇండియా నెంబర్ వన్ హీరో అని మళ్ళీ రుజువు అయింది...గత కొంత కాలంగా విజయ్ సినిమాల టీజర్ లు యు ట్యూబ్ లో సునామి సృష్టిస్తున్నాయి. మెర్సల్ నుంచి మొన్నటి వరకు వచ్చిన బిగిల్ సినిమాల టీజర్ లు, ట్రైలర్ లు అత్యధికంగా లైక్స్ రాబట్టి వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా తలపతి విజయ్ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాస్టర్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సోషల్‌ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ టీజర్  24 గంటలు గడవకముందే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు 1.7 మిలియన్ లైక్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 22 మిలియన్ వ్యూస్ దాటగా.. 1.9మిలియన్ లైకులతో ఎవరికీ  అందని ఎత్తులో నిలిచింది ఈ టీజర్. విజయ్ స్టామినా ఏంటో మరో సారి రుజువు చేసింది...ఇప్పుడు దాకా 24 మిలియన్ వ్యూస్...2 మిలియన్ లైక్స్ రాబట్టి యు ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది.

ఇక లోకేష్ కనకరాజ్ కార్తితో ‘ఖైదీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇంత మంచి సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కావడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలన్నీ వరుసగా వందల కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో నేరుగా విడుదలవుతున్న ‘మాస్టర్’తో విజయ్ రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం.ఇక ఈ సినిమా కచ్చితంగా ఒక సెన్సేషన్ క్రెయేట్ చేసేలా ఖాయంగా సినిమా టీజర్ చూస్తే అర్ధమవుతుంది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: