కృష్ణ గురించి మహేష్ అలా చెప్తారని ఎవరూ ఊహించలేదు ..... ??

GVK Writings
ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు విపరీతమైన క్రేజ్ పాపులారిటీ తో కొనసాగుతున్న నటుడు మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ నట వారసుడిగా చిన్నతనంలోనే పలు సినిమాల్లో నటించి తన నటనతో ఎందరో ప్రేక్షకులను మెప్పించిన మహేష్ బాబు ఆ తర్వాత రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా 1999లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది.

ఆ విధంగా హీరోగా తొలి సినిమాతోనే గొప్ప క్రేజ్ దక్కించుకున్న మహేష్ అక్కడి నుండి వరుస అవకాశాలతో దూసుకెళ్లారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానానికి దగ్గరగా ఉన్న అతికొద్ది హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో సర్కారు వారి పాట సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎప్పుడూ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి ఇంటర్వ్యూ ల్లో ఎంతో గొప్పగా చెప్పే మహేష్ బాబు ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కొంత సంచలనంగా వ్యాఖ్యానించారనే చెప్పాలి. మొదటి నుంచి కూడా తన తండ్రి కృష్ణ, సినిమాల షూటింగ్ విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు తమ చదువులు అలానే తమతో సమయం గడపటం విషయమై పక్కాగా శ్రద్ధ తీసుకునే వారని, అయితే నాన్నకు తీరిక లేని సమయంలో అన్నయ్య ఎక్కువగా తన బాగోగులు చూసుకునే వారని చెప్పుకొచ్చారు మహేష్.

ఇకపోతే తనకు రోల్ మోడల్ మరియు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయన తండ్రి కృష్ణ సిరి సినీ కెరీర్ గురించి మాట్లాడటానికి తన వయసు సరిపోదని ఎందరికో టాలీవుడ్ లో ఆదర్శప్రాయంగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ విషయంలో ఏ హీరో కూడా చేయలేనన్ని గొప్ప ప్రయోగాలు చేశారని ప్రస్తుతం 25 లేదా 30 సినిమాలు చేయాలంటేనే కష్టతరమవుతుందని, అటువంటిది అప్పట్లో ఆయన ఏకంగా 350 తెలుగు సినిమాల్లో నటించారు అంటే నిజంగా  అది ఎంతో గ్రేట్ అని మహేష్ బాబు చెప్పారు. మొదటి నుంచి కూడా తండ్రిపై విపరీతమైన ప్రేమాభిమానాలు గౌరవం కలిగిన మహేష్ బాబు త్వరలో ఆయనతో కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఘట్టమనేని అభిమానులు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. మరి వారి ఆశ నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: