విషాదం: ప్రముఖ నటుడు ఆత్మహత్య...!
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య మరువకముందే ఇప్పుడు మరో తార అదే తరహాలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. బాలీవుడ్ చెందిన ప్రముఖ నటుడు అసిఫ్ బస్రా ధర్మశాలలోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. 53 ఏళ్ల ఈ నటుడు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా నటించి అందరి మన్నలను పొందాడు.1998 నుండి నటుడిగా కొనసాగతున్న ఈయన ఎన్నో సినిమాలలో తన నటనతో మెప్పించాడు.
అయితే ఈ కేసు పోలీసులకు ఒక మిస్టరీగా మారింది.... ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏవీ ఇప్పటివరకు బయటకు రాలేదు... ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణంపై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ మొదలుపెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆసిఫ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని బాలీవుడ్ ప్రేక్షకులు బాధపడుతున్నారు అందులోనూ ఈ వయసులో ఆయనకు వచ్చిన అంత కష్టం ఏంటి..?? అని ఆలోచిస్తున్నారు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు త్వరలోనే వివరాలను బహిర్గతం చేయనున్నారు అని తెలుస్తోంది. అయితే ఎందుకు ఒక్క సినీ పరిశ్రమశలోనే ఈ విధంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.