సూర్యకి ఈ సినిమా హిట్ ఇస్తుందా...?
తాజాగా సూర్య సూరారై పొట్రు లో నటించాడు. గురు ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం చేశారు. ఈ సినిమాను తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసినదే. ఈ సినిమాకు సూర్యా చాలానే కష్టపడ్డాడు, ఎంతలా అంటే ఎన్నడు రీడింగ్ సెషన్ చేయని సూర్య ఈ సినిమాకు రీడింగ్ సెషన్లో కూడా పాల్గొన్నాడు. అంతేకాకుండా బయటి వారి నిర్మాతగా వ్యవహరిస్తే అనవసరమైన ప్రశ్నలు వేస్తారని తానే స్వయంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఇక ఈ కధ విషయానికి వస్తే... ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాత్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా చిత్రించారు. ఎప్పుడు తెర మీదకి వస్తుంది అనే విషయానికి వస్తే.... థియేటర్లు ఇంకా తెరుచుకోని పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.సరైన కథ లేక గత మూడేళ్ళుగా సినిమాలకి దూరంగా ఉన్న సూర్య ఇప్పుడు నటిస్తున్నాడు అంటే ఈ సినిమా హిట్, ప్లాప్ అనేవి సూర్యకు ఎంతగానో ముఖ్యం అనే చెప్పాలి. మరి ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.