ఓ టి టి ప్లాట్ ఫామ్ వల్ల లాభం వీరికేనా...?
ఇప్పుడు ఓ టి టి ల సందడి మామూలుగా లేదు..ఇప్పుడు ప్రముఖ ఓటీటీలన్నీ కొత్త సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా తమ నిర్మాణంలో ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లను రూపొందించడం మొదలుపెట్టాయి. ఇంకేముంది అప్ కమింగ్ ఆర్టిస్టులకు మంచి ప్లాట్ఫామ్ దొరికినట్లయింది.ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ - జీ 5 వంటి ఓటీటీలను ఉపయోగించుకుని ముంబైలో ఉన్న అప్ కమింగ్ హీరోయిన్లు తమ అవసరాలకు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగునాట కూడా ఈ పద్ధతి ఊపందుకుందని తెలుస్తోంది. దీంతో వారికి కావాల్సినంత పని దొరికింది... అటు వాళ్ళ టాలెంట్ నిరూపించుకొనే అవకాశం లభించింది.
తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలనుకునే అందమైన ముద్దు గుమ్మలకు...ఓటీటీలు రూపొందించే వెబ్ సిరీస్ లు - ఇండిపెండెంట్ సినిమాలు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇకపోతే ఓటీటీ 'ఆహా'తో పాటు పలు ఓటీటీలు రూపొందించే వెబ్ కంటెంట్ లో చాలా మంది తెలుగు అమ్మాయిలు చోటు దక్కించుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పునర్నవి భూపాళం - చాందినీ చౌదరి - పూజిత పొన్నాడ వంటి తెలుగు అందాలు ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయి ఇప్పుడు ఓటీటీ స్టార్స్ గా అవకాశాలను చేజిక్కించుకుని కెరియర్ ను మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.