యశ్ కోసం పరితపిస్తున్న రౌడీ డైరెక్టర్...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సందీప్ రెడ్డి వంగ "అర్జున్ రెడ్డి" లాంటి మాస్టర్ పీస్ ని తెరకెక్కించాడు.ఆ సినిమాతో విజయ్ దేవరకొండ ఎంత పెద్ద స్టార్ హీరో అయ్యాడో అందరికి తెలిసిందే.  తరువాత ఈ డైరెక్టర్ తన  ‘అర్జున్ రెడ్డి’ నే హిందీలోకి ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు ఆ సినిమా దాదాపు 250 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి బాలీవుడ్ విశ్లేషకులని షాక్ కి గురి చేసింది. దాంతో అక్కడి నిర్మాతలు ఇతనితో సినిమాలు రూపొందించడానికి ముందుకొస్తున్నారు.
ఇప్పుడు సందీప్ పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలని భావిస్తున్నాడట. రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చెయ్యాలని మొన్నటివరకూ ట్రై చేసాడు. కానీ వర్కౌట్ కాలేదు. దాంతో ఇతని దృష్టి ఇప్పుడు ‘కెజిఎఫ్’ హీరో రాకింగ్ స్టార్ యష్ పై పడినట్టు టాక్. ఈ క్రమంలో సందీప్ రాఖీ భాయ్ కోసం  ఓ పాన్ ఇండియా కథని సిద్ధం  చేసుకుంటున్నాడట.ఇది ఒక పీరియాడికల్  డ్రామా అని తెలుస్తుంది. ఇది  కనుక యష్ తో  ఓకే అయితే  పాన్ ఇండియా లెవెల్లోనే దీనిని తెరకెక్కించాలని సందీప్ భావిస్తున్నాడట. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: