ప్రభాస్ గురించి మీరు అనుకున్నది తప్పు .... అసలు నిజాలు బయటపెట్టిన పూజా హెగ్డే ....??

GVK Writings
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే తొలిసారిగా ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, షా షా ఛత్రి, మురళి శర్మ, ప్రియదర్శి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి దాదాపుగా మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ట్లు తెలుస్తోంది. కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక యదార్థమైన ప్రేమ కథకు రూపంగా దర్శకుడు రాధాకృష్ణ పలు కమర్షియల్ హంగులు కలగలిపి ఈ సినిమా తీస్తున్నాడని అంటున్నారు.

ఇటీవల యూరప్లో లేటెస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా దాదాపు 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మిగిలిన భాగాన్ని అతి త్వరలో హైదరాబాద్ లో చిత్రీకరించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్రణాళిక సిద్ధం చేస్తోందట. ఇటీవల ఒక మీడియా చానల్ ఇంటర్వ్యూ లో భాగంగా హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమా గురించి పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తన కెరీర్లో రాధేశ్యామ్ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందని అలానే ఈ సినిమాలో తాను నటిస్తున్న ప్రేరణ పాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పుకొచ్చిన పూజా హెగ్డే ప్రభాస్ ఎంతో సిగ్గు పడుతూ ఎవరితో పెద్దగా మాట్లాడరు అనేటువంటి వార్తలపై స్పందిస్తూ ఆయన సెట్స్ లో ఎంతో సరదాగా ఉంటారు.

అంతే కాక సెట్ లో నన్ను అయితే మరింతగా ఆటపట్టిస్తుంటారని అన్నారు. అలానే తనతో పాటు మిగతా వారు అందరి పై సరదాగా జోక్స్ వేస్తూ ఇస్తూ ఉండే ప్రభాస్ తో కలిసి ఉంటే సమయం ఇట్టే గడిచిపోతుందని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రిలీజ్ అనంతరం తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి తన కెరీర్ పరంగా మరింత గొప్పపేరు తెచ్చిపెడుతుందని అని ఆమె ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: