"ఆదిపురుష్" పనులు మొదలు పెట్టిన ప్రభాస్...!!
ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ ఇప్పుడు ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ టీ సిరీస్ సంస్థతో కలిసి చర్చలు జరుపుతున్నాడట. ప్రభాస్ సినిమాలన్నీ హిందీలో టీసిరీస్ సంస్థే ప్రొడ్యూస్ చేస్తోంది. ‘సాహో’ సినిమాను కూడా ఈ సంస్థే హిందీలో రిలీజ్ చేసింది. అలానే ‘రాధేశ్యామ్’ సినిమా హక్కులు కూడా కొనేసింది. ఇప్పుడు ప్రభాస్ తదుపరి సినిమా ‘ఆదిపురుష్’ని కూడా అన్ని భాషల్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’ పనులను దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాడట.
ఈ క్రమంలో దర్శకుడు ఓంరౌత్ తో కూర్చొని ముందుగా హీరోయిన్ ని ఫైనల్ చేస్తాడట. జనవరి నుండి షూటింగ్ మొదలుపెట్టాలనేది వీరి ఆలోచన. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాను ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్ తో స్టూడియోలోనే చిత్రీకరిస్తారట. కాబట్టి బయటకి వెళ్లి వేర్వేరు లొకేషన్స్ లో చిత్రీకరించడం, సెట్స్ వేయడం వంటి హంగామా ఉండదు. బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ అన్నీ గ్రాఫిక్స్ లో తరువాత యాడ్ చేస్తారట. ‘ఆదిపురుష్’ సినిమాని జనవరి నుండి మార్చి వరకు కొంత భాగం పూర్తి చేసి ఆ తరువాత నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలనేది ప్రభాస్ ప్లాన్.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.