హడావిడి మామూలుగా లేదు..!
టాలీవుడ్ మోస్ట్ అవైటడ్ మూవీ "ట్రిపుల్ ఆర్' కూడా షూటింగ్ మొదలుపెట్టేసింది. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ప్రభాస్ "రాధేశ్యామ్' రీసెంట్‌గానే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది.
కరెక్ట్ లొకేషన్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసిన "పుష్ప' టీమ్ కూడా షూటింగ్ స్టార్ట్ చేసింది. కేరళ ఫారెస్ట్‌లో షూటింగ్ చెయ్యాలనుకున్న టీమ్, కరోనా ప్రభావంతో మనసు మార్చుకుంది. తెలుగు స్టేట్స్లోనే షూట్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో "పుష్ప' షూటింగ్ రీస్టార్ట్ కాబోతోంది.
మొదట్లో కరోనా ఉధృతి తగ్గేవరకు షూటింగులు జరగడం కష్టమని ప్రచారం జరిగింది గానీ, టాలీవుడ్ స్టార్లు మాత్రం గ్యాప్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదట. వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో తెలియదు, కోవిడ్ ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ తెలీట్లేదు. అలాంటప్పుడు ఇంకా వెయిట్ చెయ్యడం ఎందుకు.. జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లిపోదాం అని సెట్స్‌లో అడుగుపెట్టేస్తున్నారు హీరోలు.
కరోనా లాక్డౌన్ కంటే ముందే బ్రేక్ తీసుకున్న సినిమా "ఆచార్య'. ఇక ఇన్నాళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నవంబర్ 9 నుంచి ఈ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ కాబోతోంది. ఇక కరోనా ప్రభావం తగ్గే వరకు షూటింగ్‌కి వెళ్లనని చెప్పని బాలక్రిష్ణ కూడా బోయపాటి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టేశాడు. అక్టోబర్ లాస్ట్ వీక్‌లో బీబీ3 షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది.
సీనియర్స్‌లో అందరికంటే ముందే షూటింగ్ మొదలుపెట్టిన హీరో నాగార్జున. "బిగ్‌బాస్4' ప్రోమోస్‌తో కెమెరా ముందుకెళ్లిన నాగ్, "వైల్డ్ డాగ్' మనాలీ షెడ్యూల్‌ని పూర్తి చేస్తున్నాడు. వెంకటేశ్ "నారప్ప' షూటింగ్ కూడా రీస్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ సరౌండింగ్స్‌లో "నారప్ప' షూటింగ్ జరుగుతోంది.