పెళ్లయిన తర్వాత రెచ్చిపోతున్న కాజల్ అగర్వాల్..

Suma Kallamadi
అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల తన ప్రియుడు గౌతమ్ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు జరుపుకున్న నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. సాధారణంగా తన వ్యక్తిగత ఫోటోలను చాలా తక్కువగా షేర్ చేసుకునే కాజల్ అగర్వాల్ పెళ్లయిన తర్వాత విపరీతంగా ఫోటోలను షేర్ చేస్తూ తెగ రెచ్చిపోతున్నారు. తన నిశ్చితార్థానికి ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. “కర్వా చౌత్”  పండుగ రోజున దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆమెకు ఒక్క ఇన్ స్టాగ్రామ్ ఖాతాలోనే ఒక కోటి 60 లక్షల మంది ఫాల్లోవర్లు ఉన్నారు. అందుకే దక్షిణ భారతదేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ దూసుకుపోతున్నారు.


పెళ్లి కాగానే హనీమూన్ ట్రిప్ లకి కాజల్ అగర్వాల్ వెళ్లి వెళ్తారా లేదా ఈ నెల నవంబర్ 9వ తేదీన చిరంజీవి సినిమా అయిన ఆచార్య చిత్రీకరణలో పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకున్నారు కానీ ఆమె తప్పుకోవడంతో కాజల్ అగర్వాల్ కి నటించే ఛాన్స్ దక్కింది. ఖైదీ నెంబర్ 150 చిత్రం లో కూడా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించారు. ఈ సినిమాలో నటిస్తే ఇది ఆమెకి చిరంజీవితో కలిసి నటిస్తున్న రెండవ సినిమా అవుతుంది.


తమిళంలో హీరో కార్తీ సరసన కూడా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా ఈమె హీరోయిన్ పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కొన్ని కారణాల వలన ఈ షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ ఈ చిత్రాన్ని పునః ప్రారంభిస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అని వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: