ఈ సినిమా పాజిటివ్ బజ్ మిస్ అవ్వడానికి కారణం ఏమిటి...?

Suma Kallamadi
నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ తెర మీద రాబోతున్న సంగతి మనకి తెలిసినదే. ఈ సినిమాని హ్యాపీడేస్  చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి టాక్ తో మొదట వచ్చి ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ అయి పోయింది. దీనికి కారణం ఏమిటి.. ? పూర్తిగా చూస్తే...  రొమాంటిక్.. ఎమోషనల్ లవ్ స్టోరీ తో ఈ మూవీని శేఖర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు మంచిగా ఆకట్టుకుంటుంది అని భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. షూటింగ్ చివరి దశ లో ఉండ గానే కరోనా ఎంట్రీ ఇవ్వడం తో సినిమా వాయిదా పడింది అన్న సంగతి తెలిసినదే.

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాల పై ఓవర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రేమ కథల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు.. టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి కాంబో సెట్ కావడం తో సినిమా హిట్ అవుతుందనే టాక్ విన్పించింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన కొద్ది కాలానికే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైన ఈ  'లవ్ స్టోరీ'  సినిమా పై ఏర్పడిన పాజిటివ్ బజ్ ప్రస్తుతం కన్పించడం లేదనే కామెంట్స్ వినపడుతున్నాయి. చివరి దశకు చేరుకునన్నా కూడా సైలంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇది ఇలా ఉండగా.... ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా? లేదా ఓటీటీలో రిలీజు అవుతుందా?  వంటి అప్డేట్స్ కూడా రాలేదు. మరి ఎప్పుడు చెబుతారన్నది కూడా ప్రశ్నార్ధకమే. దీంతో 'లవ్ స్టోరీ'ని జనాలు పట్టించుకోవడం లేదా? లేక చిత్రయూనిట్ ఇప్పట్లో ప్రమోషన్ ఎందుకని సైలంట్ అయ్యారా?అనేది కూడా అర్ధం కావడం లేదు. సినిమా ప్రారంభం చూపినంత ప్రభావం చివర్లో చూపించడం లేదని కాస్త నిరాశ పడుతున్నారు అభిమానులు.
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: