డైరెక్టర్ శంకర్ చేస్తున్న ఆ ప్రయోగం వర్కౌట్ అవుతుందా..
కాగా, శంకర్ , చిత్ర నిర్మాత మధ్య గొడవలు, సెట్లో ప్రమాదం జరిగి టెక్నీషియన్లు చనిపోవడం, లాక్‌డౌన్ వంటి కారణాలో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా షూటింగ్ తిరిగి ప్రారంభించే సమయానికి బడ్జెట్ విషయంలో శంకర్, నిర్మాత మధ్య మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. ఈ మేరకు సినిమా నుంచి తప్పుకునే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.. ఈ సినిమా మొదలై దాదాపు చాలా కాలం అయ్యింది. అయిన ఇలా గొడవల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడం కమల్ అభిమానులు , శంకర్ అభిమానులకు మింగుడు పడలేదు.
ఈ పరిస్థితుల్లో శంకర్ కొత్త చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్ విరామ సమయంలో శంకర్ కొత్త చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో దక్షిణాదికి చెందిన నలుగురు స్టార్ హీరోలు నటించబోతున్నారట.. కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి , కన్నడ స్టార్ హీరో యష్ , తెలుగు , మలయాళ హీరోలు ఇందులో నటించనునున్నారని వార్త ఒకటి షికారు చేస్తోంది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను దర్శకుడు శంకర్ త్వరలోనే వెల్లడించనున్నారు. తెలుగులో అందరూ మంచి పోటీ ఉన్న హీరోలే.. మరి వీరిలో ఎవరికీ ఆ ఛాన్స్ వస్తుందో చూడాలి..