లైటింగ్ సూరిబాబు.. మరో చిట్టిబాబు అవుతాడా..?

shami
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి తన టాలెంట్ తో చిన్న గా పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు సుధీర్ బాబు. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ సినిమాల మీద ఇష్టంతో SMS సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ కథా చిత్రం సినిమాతో హిట్ అందుకుని సమ్మోహనంతో మరో క్లాస్ హిట్ కొట్టాడు. వి సినిమాలో నాని నెగటివ్ రోల్ తో మెప్పించగా పవర్ ఫుల్ పోలీస్ గా సుధీర్ బాబు తన సిక్స్ ప్యాక్ తో షాక్ ఇచ్చాడు. కరెక్ట్ సినిమా పడితే సుధీర్ కూడా అదిరిపోయే సినిమా ఇవ్వగలడని అర్ధమైంది.    

ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు పలాస డైరక్టర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు శ్రీదేవి సోడా సెంటర్ అని టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాలో లైటింగ్ సూరి బాబుగా సుధీర్ నటిస్తున్నాడు. కెరియర్ లో ఫస్ట్ టైం సుధీర్ మాస్ రోల్ చేస్తున్నాడని అనిపిస్తుంది. పలాస డైరక్టర్ కరుణ కుమార్ మరోసారి ఈ సినిమాను కూడా పిరియాడికల్ మూవీగా ప్లాన్ చేస్తున్నాడు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో సుధీర్ బాబు పాత్ర రంగస్థలం లో రాం చరణ్ పాత్రలా ఉంటుందని అంటున్నారు. చిట్టిబాబు తరహాలోనే ఈ లైటింగ్ సూరి బాబు పాత్ర ఉంటుందని అంటున్నారు. చూస్తుంటే సుధీర్ బాబుకి కరెక్ట్ టైం లో కరెక్ట్ సినిమా పడ్డదని అనిపిస్తుంది. మరి శ్రీదేవి సోడా సెంటర్ దగ్గర లైటింగ్ సూరి బాబు ఏం చేస్తాడన్నది చూడాలి.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: