బిచ్చగాడు బ్యానర్ లో మరో సినిమా... వివరలు ఇవే....!

Suma Kallamadi
బిచ్చగాడు సినిమాని ఎవరైనా మర్చిపోగలరా...?  రొటీన్ స్టోరీ లాగ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి ఈ కథని తీయడం జరిగింది. నిజంగా బిచ్చగాడు సినిమా కి చాలా మంది కనెక్ట్ అయి ఉంటారు. ఆ సినిమాని ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఆ సినిమాలో ఎన్నో వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే తీరాలి. ఆ కధ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలానే నటులు కూడా తమ ట్యాలెంట్ తో బాగా నటించి ఆకట్టేసుకున్నారు. మరీ ముఖ్యంగా విజయ్‌ ఆంటోని గురించి  చెప్పుకునే తీరాలి. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై రూపొందిన ఈ చిత్రం తెలుగు లో అనూహ్య విజయాన్ని అందుకుంది.

విజయ్‌ ఆంటోని హీరోగా వచ్చిన ' బిచ్చగాడు ' చిత్రం అందరికీ గుర్తుంది పోతుంది. ఆ సినిమా లో తన నటన గురించి ఎంత వర్ణించినా తక్కువే. అలానే  ఇప్పటికీ ఆ సినిమా లోని ఓ పాట అన్ని చోట్లా వినబడుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా బిచ్చగాడు సినిమా  తర్వాత ఈ బ్యానర్‌ లో కొన్ని సినిమాలు వచ్చాయి...... కానీ అవి అంత గొప్ప విజయాన్ని మాత్రం అందుకోలేదు.

తాజాగా ఈ బ్యానర్‌ లో మరో మూవీని ప్రకటించడం జరిగింది.  తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు' అనే టైటిల్‌ తో వస్తోంది. ప్రముఖ నటీ నటులు నటించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. లుక్‌ని కూడా ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకుడు. న్యూ డైమెన్షన్ క్యారెక్టర్‌ లో లక్ష్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: