
ఆదాశర్మ "క్వశ్చన్ మార్క్" నుంచి విడుదలైన మొదటి పాట...!
హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ…“ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాలన్నీ కూడా పర్ఫార్మెన్స్ కి స్కోపున్న చిత్రాలే . అదే కోవలో ఈ సినిమాలో కూడా నటను ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాటకు శేఖర్ మాస్టర్ గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు. కరోనా టైమ్ లో స్టార్ట్ చేసి కరోనా టైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న మొదటి సినిమా మాది. సినిమా చాలా బాగా వచ్చింది. డైరక్టర్స్ ఎక్స్ లెంట్ గా డీల్ చేశారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది“ అన్నారు.
దర్శకుడు విప్రా మాట్లాడుతూ.. “ఇలాంటి సంక్లిష్ట సమయంలో సినిమా చేయడమనేది ఎంతో రిస్క్ తో కూడుకున్నది. మా నిర్మాత సహకారం వల్లే ఇది చేయగలిగాం. మా టీమ్ అంతా కూడా ఎంతో సహకరించారు. ముఖ్యంగా ఆదాశర్మగారి సపోర్ట్ మరువలేము. కరోనా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా సినిమా పూర్తి చేశాం. ఇక మొదట ఇందులో ఒక పాట పెట్టాలనుకున్నప్పుడు ఎలాంటి పాటైతే బావుంటుందని అంతా ఆలోచించాం. రఘు కుంచెం గారు మంచి పాటిచ్చారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తో నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు“ అన్నారు. ఇంకా ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..