
పొలిటీషియన్ గా మారబోతున్న హీరో సూర్య..??
ముఖ్యంగా తన సినిమాలు అన్నింటిని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యాడు సూర్య. ఇక ప్రస్తుతం సూరరై ఫోట్రూ అనే సినిమాతో దీపావళి సందర్భంగా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సూర్య సిద్ధ మైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు హీరో సూర్య. అయితే వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాడివాసల్ సినిమా సూర్య నటిస్తున్న 39 వ చిత్రం.
ఇటీవలే తన 40వ చిత్రానికి కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సూర్య 40 చిత్రానికి సంబంధించిన ప్రకటన విడుదలైంది. సూర్య హీరోగా నటిస్తున్న 40వ చిత్రం సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ సినిమాలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని పాండిరాజు తెలిపారు. అయితే ఇప్పటికే ఎన్జీకే సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించిన సూర్య తన నటనతో అందరిని మెప్పించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో సూర్య.