రాధేశ్యామ్ మాత్రమే కాదు...ఆదిపురుష్ నుండి కూడానా ....??
దానితో ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాతో ఎలాగైనా పెద్ద సక్సెస్ కొట్టేలా ప్రభాస్ ఎంతో కసితో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ కు జోడిగా తొలిసారిగా పూజా హెగ్డే నటిస్తుండగా యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి, ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ యూరోప్ లో జరుగుతుండగా దీనిని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే రేపు ప్రభాస్ జన్మదినం సందర్భంగా మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక ప్రత్యేక మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనుంది.
అలానే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి రాధేశ్యామ్ నుండి మాత్రమే కాకుండా అతి త్వరలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమా నుండి కూడా అయన జన్మదినం రోజున మరొక పెద్ద అప్ డేట్ రానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ కనిపించనున్నాడు. కాగా శివుడి పాత్రలో అజయ్ దేవగన్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆదిపురుష్ మూవీ టీమ్ నుండి ఎటువంటి అప్ డేట్ వస్తుందో తెలియాలి అంటే మరొక 72 గంటలు వెయిట్ చేయక తప్పదు.....!!