ప్రభాస్ 21 కి అమితాబ్ దిమ్మతిరిగే రెమ్యూనరేషన్....
దీపికకు రూ.8కోట్ల నుండీ రూ.10 కోట్ల వరకూ ఇస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఇక అమితాబ్ కు కూడా భారీ గానే ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్ర 25 నిమిషాలు నిడివి కలదని టాక్ . ఆ మాత్రం దానికే 25 కోట్ల వరకూ అమితాబ్ కు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే తెలుగులో ఓ స్టార్ హీరోకి ఇచ్చినట్టు ఇస్తున్నారన్న మాట. అయితే ఈయనకు అంత ఇవ్వాల్సిన పనిలేదు అన్నది కొందరి వాదన. గతేడాది ‘సైరా నరసింహరెడ్డి’ వంటి చిత్రంలో అమితాబ్ నటించినప్పటికీ.. ఆ చిత్రం బాలీవుడ్లో 10కోట్ల షేర్ ను కూడా కలెక్ట్ చెయ్యలేదు. అందుకే వారిలా కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
పైగా అమితాబ్ పార్ట్ ను ఆయనకు అనుకూలంగా ముంబైలోనే జరుపుతామని చిత్ర బృందం హామీ ఇచ్చారట. అంత తగ్గాల్సిన అవసరమేంటి.. సౌత్ లోనే చాలా మంది మంచి నటులు ఉన్నారు కదా అని ఇండస్ట్రీలో గుసగుసలు కూడా మొదలయ్యాయి. నిజంగా అమితాబ్ కు 25 కోట్లు ఇస్తున్నారా? లేక ఇది ఫేకేనా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు.