విశాల్ కి పెద్ద విలన్ లా మారిన ఆర్య...!!!
ఇందులో హీరోగా విశాల్ నటిస్తుండగా.. అతడితో తలపడే విలన్ గా ఆర్య కనిపిస్తారట. సినిమాలో ఆర్య పాత్ర హీరో రేంజ్ కి ఎంతమాత్రం తగ్గకుండా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు. గతంలో విశాల్-ఆర్య కలిసి ‘వాడు వీడు’ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. దర్శకుడు ఆనంద్ శంకర్ తెలుగు, తమిళ భాషల్లో విజయ్ దేవరకొండ హీరోగా ‘నోటా’ అనే సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా ఆడకపోవడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకొని.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు విశాల్-ఆర్య కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ‘గడ్డలకొండ గణేష్’ ఫేమ్ మృణాళిని హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఆనంద్ శంకర్ నోటా సినిమా ప్లాప్ అయిన దానికి ముందు విక్రమ్ తో తీసిన "ఇంకొక్కడు" సినిమా ఆకట్టుకుంది. ఆ సినిమాని చక్కగా తీసినందుకు ఇతనికి ఛాన్స్ ఇచ్చారని సమాచారం.