నా చావు మరో మిస్టరీ అవుతుందేమో.. రాష్ట్రపతికి పాయల్ ఘోష్ లేఖ..!!

Satvika

ఇటీవల బాలీవుడ్ లో సంచలనంగా మారిన సంఘటన సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు..ఈ కేసు పూర్తిగా ఒక కొలిక్కి రాక ముందే..బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం ఊపందుకుంది.. ఈ కేసులో చాలా మంది పై అనుమానం రావడంతో  సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. పలువురికి నోటీసులు కూడా పంపింది.ఈ మేరకు దీపికా పదుకునే కోర్టుకు హాజరై సంచలన విషయాలు బయట పెట్టింది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చింది..


ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో డైరెక్టర్ల వల్ల లైగింక వేధింపులకు గురయ్యాము అని చాలా మంది వెలుగులోకి వచ్చారు.ఈ విషయం పై హాట్ బ్యూటీ పాయల్ ఘోష్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయం పై స్పందించిన సినీ ప్రముఖులు అనురాగ్ అలాంటి వాడు కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తీవ్ర చర్చలకు దారితీసింది.


ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది..హీరోయిన్ రిచా చద్దాను కూడా ఈ ఇష్యూలోకి లాగుతూ అనురాగ్ కశ్యప్‌తో ఆమె సన్నిహితంగా ఉందని పాయల్ చేసిన ఆరోపణలు చేయడంతో రిచా.. పాయల్‌పై పరువు నష్టం దావా వేస్తూ కోర్టు మెట్లెక్కింది. దీంతో పాయల్- రిచా ల మధ్య వాడి వేడి చర్చలు ముదిరాయి.. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకూ తన ఫిర్యాదుకి సమాధానం రాకపోవడం వెనుక భారీ కుట్ర దాగివుందని పాయల్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 22 న అనురాగ్ కశ్యప్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు కొంచం కూడా ముందుకు వెళ్లక పోవడంతో  అమ్మడు కాస్త సీరియస్ అయ్యింది.నా చావు మరో మిస్టరీ అవుతుందేమో.. అప్పుడైనా బాలీవుడ్ అమ్మాయిలకు న్యాయం జరుగుతుదమో అంటూ మరోసారి రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ విషయం ఇప్పుడు మరోసారి చర్చలకు దారితీసింది.. చివరికి ఏమౌతుందో అని ఆలోచనలో పడేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: