దిల్ రాజ్ బోయపాటిలను కలవర పెడుతున్న మహేష్ మౌనం !

Seetha Sailaja
భారీ సినిమాల నిర్మాతగా పేరు గాంచిన దిల్ రాజ్ చేతిలో ఎప్పుడు ఇద్దరు ముగ్గురు టాప్ హీరోల డేట్స్ ఉండేవి. అయితే ప్రస్తుతం దిల్ రాజ్ బ్యానర్ లో ‘వకీల్ సాబ్’ తప్ప మరే టాప్ హీరో ప్రాజెక్ట్ నిర్మాణంలో లేదు. అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ కి దిల్ రాజ్ ఒకే చెప్పినా ఈ మూవీకి వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఇప్పట్లో డేట్స్ ఇచ్చే ఆస్కారం లేదు.


ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చాడు అని వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. వాస్తవానికి బోయపాటి బాలకృష్ణ తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కావడానికి ఇంకా చాల సమయం పట్టే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో దిల్ రాజ్ బోయపాటిని ఇంత ముందుగా ఎందుకు బుక్ చేసుకున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.



తెలుస్తున్న సమాచారం మేరకు దిల్ రాజ్ మహేష్ బోయపాటి లను కలిపి ఒక మాస్ మూవీ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి మహేష్ దృష్టి అంతా త్రివిక్రమ్ పై ఉన్న పరిస్థితులలో ప్రస్తుతం బోయపాటి చెప్పే కథను వినడానికి మహేష్ ఆశక్తి చూపడంలేదు అంటూ లీకులు వస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా వంశీ పైడిపల్లి తో చరణ్ మూవీని సెట్ చేయడానికి దిల్ రాజ్ మరో వ్యూహం నడుపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభాస్ తో సినిమా తీయాలని దిల్ రాజ్ చిరకాల కోరిక అయితే ఆ కోరిక ఇప్పట్లో తీరే అవకాశం లేదు. దీనితో ప్రస్తుత పరిస్థితులలో సినిమా నిర్మాణం చేయాలి అంటే ఒక్క టాప్ హీరోల సినిమాలతోనే శ్రేయస్కరం అన్న అభిప్రాయంతో దిల్ రాజ్ బోయపాటికి అడ్వాన్స్ లు ఇచ్చి అతడు తయారుచేసిన కథకు ఏ హీరో దొరుకుతాడా అన్న అన్వేషణ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: