సంక్రాంతి బరిలో ఈ చిత్రాలు డౌటే!

VAMSI
కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ లేనంత నష్టాల్లో కూరుకుపోయింది. అక్కడ పనిచేసే రోజు వారీ కార్మికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే దీనికి ఉపశమనంగా కొన్ని రోజులు క్రితం  కరోనా నిబంధనలతో షూటింగులు జరుపుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ సమస్య తీరేలా లేదు. ఎందుకంటే తీసిన సినిమాలను విడుదల చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్స్ కు అనుమతులు రాకపోవడమే. కేంద్రం మాత్రం ఈ నెల 15 నుండి థియేటర్స్ తెరుచుకోవచ్చని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపింది. దీనితో అప్ ప్రభుత్వం ఇంకో నెలరోజులు పరిస్థితిని చూసి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది.

దీనితో సినిమా ఇండస్ట్రీ పెద్దలు షూటింగ్ పూర్తిచేసిన సినిమాలపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి  ప్రధాన పండుగ సంక్రాంతి. ఈ పండుగకు తమ తమ సినిమాలను విడుదల చేసి మంచి కలెక్షన్ లను రాబట్టాలని డైరెక్టర్స్ , నిర్మాతలు మరియు హీరోలు తహతహలాడుతుంటారు.  అయితే ఇప్పుడు ఏ సినిమాలు ఈ సంక్రాంతి రేసులో నిలవనున్నాయి అని ఆసక్తిగా మారింది. ఇప్పటికే అందరూ అనుకుంటున్నట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కన్నడ యువ నటుడు యశ్ కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే దీనికి కొనసాగింపుగా వస్తున్న కే జి ఎఫ్ 2 మూవీ కూడా సంక్రాంతి బరిలో ఉండబోతోందని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఈ రెండు చిత్రాలతో పాటు మిడిల్ స్టేజ్ మూవీస్ అఖిల్.. పూజా హెగ్డే నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. రవితేజ నటిస్తున్నమాస్ మసాల ఎంటర్ టైనర్ `క్రాక్`.. గోపీచంద్ సీటీమార్... నాగచైతన్య `లవ్ స్టోరీ` కూడా సంక్రాంతి రేసుకి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు బాలయ్య కూడా సై అంటున్నారు. బోయపాటితో బాలకృష్ణ ఓ భారీ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా మూడు ప్రధాన చిత్రాలు సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్లు  తప్పుకున్నట్లు వార్త ప్రచారంలో ఉంది. వాటిలో ప్రభాస్ నటిస్తున్న `రాధేశ్యామ్`... మెగాస్టార్ చిరు `ఆచార్య`... బన్నీ `పుష్ప` చిత్రాలు ఉన్నాయి. మరి సంక్రాంతికి థియేటర్స్ అన్నీ ఓపెన్ అయి విడుదలయ్యే సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుందాం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: