వన్ నేనొక్కడినే డిజాస్టర్ కావడానికి కారణాలు ఇవే...!

Suma Kallamadi
వన్ నేనొక్కడినే సినిమా మహేష్ బాబు కి హిట్ ని అందివ్వలేదు. రిచ్ నెస్ , క్వాలీటీ కనిపించే మూవీగా టీజర్, ట్రైలర్ నుంచి ఆకట్టుకున్న మూవీ వన్ నేనొక్కడినే చివరకు డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసినదే. మరి దానికి కారణాలు ఏమిటి...? ఈ విషయం లోకి వస్తే..... ఆడియన్స్ తో ఆడుకుని కిక్కు ఇవ్వాలనుకున్న సుకుమార్ ప్లాన్ రివర్స్ అయింది. బైక్ తో చేజ్ చేసి, విలన్ ని మహేష్ చంపడాన్ని హీరోయిన్ షూట్ చేసి, ఛానల్ లో ప్రసారం చేస్తే, కేవలం మహేష్ ఒక్కడే కనిపిస్తాడు. ఇలా ఈ సన్నివేశం ఎవరినో కొడుతున్నట్లు ఊహాగా ఉంటుంది. అయితే దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో  వచ్చిన ఈ మూవీలో ఏదో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఉంటుందని మనకు తెలుస్తుంది. కానీ ఊహించిన స్థాయికి చేరుకోలేకపోయింది.

ఈ సినిమా 2014జనవరి 10న ఈ మూవీ రిలీజయింది.  ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగున్నా అది కన్ఫ్యూజ్ గా ఉండడం ఈ మూవీ ప్లాప్ అయ్యాడు కారణం. ముఖ్యంగా సాధారణ  ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా దీనిని తెరకెక్కించడంలో సుకుమార్ విఫలం అయ్యాడనే చెప్పాలి. ఈ చిత్రం లో  అడ్వాన్స్ టెక్నాలజీ, స్క్రీన్ ప్లే కల్సి రాలేదు. అలానే ప్రేక్షకులకి తెలియని కన్ఫ్యూజన్ లో ఆడియన్స్ ని పడేశారని చెప్పాలి.

 అలానే సినిమా లెన్త్ కూడా బాగా ఎక్కువగా ఉంది.  సాధారణంగా రెండు గంటల 10నిముషాలు మించకుండా ఇలాంటి మూవీస్ ఉండాలి. వన్ మాత్రం 2గంటల 50నిమిషాల ఉండడం తో  ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. హీరో అన్వేషణ, పగ లో ఆడియన్స్ కూడా భాగం అయ్యేలా చేయాలి అది కూడా దీనిలో మరో మైనస్ పాయింట్. కామెడీ కూడా లేక పోవడం తో పెద్దగా ఎంటర్టైన్ చెయ్యలేదు. ఇలా ఎన్నో సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: