కోలుకుంటున్న ప్రముఖ మలయాళ హీరో టోవినో థామస్

Suma Kallamadi
ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ "కాలా" సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అతని కడుపులో బలంగా దెబ్బ తగిలింది, దీంతో అతని శరీరం లోపల తీవ్రం రక్తస్రావం అయ్యింది. దెబ్బ తగిలిన రోజు ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ఆ తర్వాత అతని పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారటంతో అతన్ని కొచ్చి లోని రినై మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు.

టోవినో థామస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రి వైద్యులు వెంటనే ఐసీయూ కి తరలించి చికిత్స ప్రారంభించారు. అయితే టోవినో థామస్ ఐసీయూ లో చేరారని తెలుసుకున్న ప్రముఖ వార్తా పత్రికలు అతని పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని కథనాలు రాయగా... అతని అభిమానులు షాక్ కి గురై తీవ్ర బాధను వ్యక్తం చేశారు. అలాగే అతను కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు. నిజానికి ఆస్పత్రిలో చేరిన 5 గంటల సమయంలోనే నటుడు టోవినో థామస్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. పొత్తికడుపు లోపల రక్తస్రావం ఆపేందుకు డాక్టర్లు చికిత్స అందించడంతో అతను బాగా ఆరోగ్యం మెరుగుపడింది.

"గడచిన 24 గంటల్లో అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. శరీరం లోపల రక్తస్రావం అయినట్టు ఎటువంటి లక్షణాలు కనిపించలేదు," అని ఆసుపత్రి వర్గాలు మీడియాకి వెల్లడించాయి. ఇకపోతే టోవినో థామస్ ఐసీయూ లో జాయిన్ అయ్యారు అని తెలిసిన మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి కి గురయ్యారు. ఆ తర్వాత తేరుకొని అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఏదేమైనా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న టాలెంటెడ్ నటుడు టోవినో థామస్ చనిపోతారని చాలామంది ఆందోళనకు గురయ్యారు. కానీ అతను కోలుకుంటున్నారన్న తాజా వార్త తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోతే కనీసం రెండు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని టోవినో థామస్ కి డాక్టర్లు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: