ఫిబ్రవరి నుండి స్టార్ట్ కానున్న నితిన్, కీర్తి సురేష్ ల రెండవ మూవీ...
‘రంగ్ దే’, ‘చెక్’, ‘అంధాధున్’ షూటింగులు కంప్లీట్ చేశాక నితిన్ కెరీర్ లో స్పెషల్ ఫిలిం ‘పవర్ పేట’ స్టార్ట్ కానుంది. లిరిక్ రైటర్ నుండి డైరెక్టర్ గా మారిన కృష్ణచైతన్య డైరెక్షన్ లో నితిన్ యాక్ట్ చెయ్యనున్న సినిమా ‘పవర్ పేట’. ‘ఛల్ మోహన్ రంగ’ తరువాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. రెండు పార్టులుగా సినిమా చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఫిక్షనల్ బయోగ్రఫీగా కృష్ణచైతన్య స్క్రిప్ట్ రాశాడట. ఫిబ్రవరి నుండి నితిన్ ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నాడు.
ఫిబ్రవరిలో నితిన్ ‘పవర్ పేట’ షూటింగ్ స్టార్ట్ చేస్తే… అతడి పక్కన హీరోయిన్ రోల్ చేస్తున్న కీర్తీ సురేష్ మార్చి నుండి సెట్స్ లోకి ఎంటర్ అవుతారని తెలిసింది. ఈ సినిమా కోసం నితిన్ మేకోవర్ అవ్వనున్నాడు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, కారైకుడి, మైసూర్, హైదరాబాద్ తదితర ఏరియాలలో షూటింగ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.
ఇక కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.