ప్చ్ .... ప్రభాస్ పెళ్లి విషయంలో చేతులెత్తేశారట .... ??
సీనియర్ యాక్టర్ కృష్ణం రాజు, ప్రియదర్శి, షాషా ఛత్రి, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే డెబ్భై శాతానికి పైగా పూర్తి చేసుకుంది. అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక దీని తరువాత వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా తో పాటు బాలీవుడ్ దర్శకడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా కూడా ప్రభాస్ చేయనున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారికంగా ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే బ్యాచిలర్ అయిన ప్రభాస్ కు అసలు ఎప్పుడు పెళ్లి అవుతుంది అనేది మాత్రం ఆయన ఫ్యాన్స్ లో ఎప్పటినుండో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిందని అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఇటీవల వరుసగా పలువురు యువ హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటె, ప్రభాస్ మాత్రం పెళ్లి విషయమై దాట వేస్తున్నారు అని వారు అంటున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి విషయమై ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామల మాట్లాడుతూ, వాస్తవానికి ప్రభాస్ కు ఎన్నో మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతం అతడు సినిమాల పైనే ఎంతో దృష్టి పెట్టడం జరిగిందని, దానివలన ఆ విషయమై తుది నిర్ణయం అతడిదే అని వారు వెల్లడించడం జరిగింది. ఒకరకంగా ప్రభాస్ పెళ్లి విషయమై ఫ్యామిలీ మెంబెర్ మెంబెర్స్ చేతులెత్తేసినట్లే అని, ఇక ఆ విషయంలో స్వయంగా బాహుబలి నే నిర్ణయం తీసుకోవాలని, మరి ఆ రోజు ఎప్పుడు వస్తోందో ఏమో అంటూ పలువురు ఆయన ఫ్యాన్స్ సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!