అతను లక్కు తోక తొక్కినోడు కాదు ..... హార్డ్ వర్క్ తోక తొక్కినోడు .....??

GVK Writings
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యువ స్టార్ నటుడిగా మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న హీరో విజయ్ దేవరకొండ మొదటగా నువ్విలా సినిమాతో నటుడిలా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్ర, దాని అనంతరం ఎవడే సుబ్రహ్మణ్యం లో ఒక కీలక పాత్ర చేయడం ద్వారా కొనసాగింది ఆయన సినీ లైఫ్. వాటి అనంతరం ఆయన స్నేహితుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తొలిసారిగా పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా మారాడు విజయ్. కాగా ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

దాని అనంతరం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి అలానే యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీతా గోవిందం సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ విజయాలని అందుకొని స్టార్ హీరోగా యువతలో విశేషమైన ఆదరణను చూరగొన్న విజయ్ ఇక అక్కడి నుండి ఆయనకు వరుసగా అవకాశాల దూసుకెళ్లాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేక పోయాయి. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అలానే అతి త్వరలో ఇంద్రగంటి మోహన కృష్ణ, సుకుమార్ ల వంటి దిగ్గజ దర్శకుల సినిమాలు కూడా చేయనున్నాడు.

మరోవైపు విజయ్ తో సినిమాలు చేయాలని ఇప్పటికే చాలా మంది దర్శకులు పలు కథలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు బడా నిర్మాణ సంస్థలు కూడా విజయ్ తమ సినిమాలకు డేట్స్ ఇస్తే చాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఈ రేంజ్ లో భారీ క్రేజ్ రావడానికి అతను నక్క తోక తొక్కాడు అనేది చాలా మంది అనే మాట అని, అయితే అది నిజం కాదని తన తొలి సినిమా నుండి నటుడిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హార్డ్ వర్క్ అనే తోక తొక్కాడు కాబట్టే విజయ్ ఈనాడు స్టార్ హీరోగా ఈ రేంజి క్రేజ్ సంపాదించుకున్నాడు అని అంటున్నారు. ఇక అతి త్వరలో ఆయన నుండి రాబోయే సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధిస్తే కెరీర్ పరంగా ఆయన అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: