జపాన్ లో అదరకొట్టిన మన తెలుగు హీరోలు వీరే..

Purushottham Vinay
కోవిడ్ 19 లాక్ డౌన్ తరువాత రిలీజ్ అయిన మొదటి "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ". లాక్ డౌన్ తరువాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమా రిలీజ్ అయ్యింది ఇండియాలో కాదు జపాన్ లో..! అవును అక్కడ ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కానీ రిజల్ట్ లో మాత్రం మార్పు లేదు. సేమ్ 2 సేమ్..! అక్కడ కూడ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ చేస్తుంది. ఇక్కడ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అక్కడ కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది ఈ సినిమా.

అసలు మన సినిమాలకు కూడా జపాన్ లో అంత క్రేజ్ ఉందా? మన ఇండియన్ సినిమాలకు జపాన్ లో అంత క్రేజ్ ఏర్పడేలా చేసిన హీరో ఎవరు అని ఆరా తీస్తే..! ఇంకెవరు మన తలైవా రజినీ కాంత్ అని తెలిసింది. అవును రజినీకాంత్ గారి వల్లే జపాన్లో మన ఇండియన్ సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ఆయనతో పాటు మరికొంత మంది హీరోలు కూడా అక్కడ సత్తా చాటారు. వాళ్ళెవరు? ఆ సినిమాలేంటి? ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చూడండి..

‘ముత్తు’ తో ఇండియన్ సినిమాకి అక్కడ మార్కెట్ ఏర్పడింది. ముఖ్యంగా రజినీకాంత్ గారి సినిమాలకి అక్కడ డిమాండ్ బాగా ఎక్కువ.రజినీ కాంత్ గారి తరువాత జపాన్ లో సత్తా చాటింది మన తారకే..! అవును ‘బాద్ షా’ చిత్రంతో జపాన్ లో రచ్చ రచ్చ చేసి మన తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది చూపించాడు. అక్కడ తారక్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మన తారక్ సినిమాల్లోని పాటలకు అక్కడి జనాలు డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేసాయి కూడా..!

రజినీకాంత్ గారు ‘ముత్తు’ తో జపాన్ లో నెలకొల్పిన రికార్డులను ప్రభాస్ ‘బాహుబలి’ తో బ్రేక్ చేసాడు. మన ప్రభాస్ కటౌట్ కి ఫిదా అయిపోయారు అక్కడి జనాలు.
‘బాహుబలి’ మేనియాలో రిలీజ్ అవ్వడంతో ‘మగథీర’ కు కూడా జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.‘బాహుబలి’ తో మాత్రమే కాదు ‘సాహో’ తో కూడా జపాన్ బాక్సాఫీస్ ను షేక్ చేసాడు ప్రభాస్.

లాక్ డౌన్ తరువాత జపాన్ లో విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది. రజినీ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ చిత్రం జపాన్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: