మాస్ రాజా ఆ సినిమాలో ఉన్నట్టా.. లేనట్టా..?
ఎఫ్-3 లో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా రవితేజ కూడా నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి కాని ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. రవితేజ దగ్గరకు ఎఫ్-3 ఆఫర్ వెళ్ళిందట కాని అతని పాత్ర నచ్చక మాస్ రాజా ఈ సినిమా చేయనని చెప్పాడట. అయితే అనీల్ మాత్రం ఈ సినిమాలో రవితేజ ఉంటే ఎక్స్ ట్రీ ఎనర్జీ ఉంటుందని రవితేజ పాత్ర కూడా కొద్దిగా పెంచినట్టు తెలుస్తుంది. సో ఎఫ్-3లో రవితేజ కూడా ఉండే ఛాన్సులు ఉన్నాయని టాక్. వెంకటేష్, వరుణ్ తేజ్ లకు తోడుగా రవితేజ ఎనర్జీ కూడా తోడైతే ఆ లెక్క వేరేలా ఉంటుంది.
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నక్కిన త్రినాథ రావు కూడా రవితేజతో సినిమాకు రెడీగా ఉన్నాడు. మరి ఇన్ని కమిట్మెంట్స్ మధ్యలో ఎఫ్-3లో మాస్ రాజా ఉంటాడా లేదా అన్నది త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.