55 ఏళ్ల క్రితం..బాలసుబ్రహ్మణ్యంపై ఆర్టికల్... ఇంతకీ ఏముంది అందులో..?
బాలు జీవితంలో అప్పుడెప్పుడో వచ్చిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో ఒక పాట పాడాడు. దానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. "మంచి గొంతు, అద్భుతంగా ఉంది,” అని ఆ పాట విన్న ఒకాయన రెండో ఆయనతో అన్నాడు. ఈవిధంగా ఆనోటా ఈ నోటా పడి ఆ పాటకు చాలా మంచి పేరొచ్చింది. ఇలా మొదలయింది బాలు గారి సంగీత ప్రస్థానం. తరువాత మరికొందరు బాల సుబ్రహ్మణ్యం పాట విని "ఈయన చిత్రాల్లో పాడడం అదే మొదటి సారి" అంటే నమ్మశక్యంకావడం లేదని ముక్కునవేలేసుకున్నారు. అంతేకాకుండా అందరిచేత "ఘనమైన కూత కూసిన పిట్ట ఇంత కొంచెంఉండటం ఏమిటని అనుకుంటారు" అని పొగడ్తలతో ముంచెత్తారు. అప్పుడు ఈయన వయస్సు 22 ఏళ్ళు మాత్రమే. పైగా ఏ ఐ ఎం ఈ చదువుతున్నాడు. బాల సుబ్రహ్మణ్యం తండ్రి గారు హరికథలు చెబుతారు. ఆయన పేరు పండితారాధ్యుల సాంబమూర్తి. ఆ వాసన బాల సుబ్రహ్మణ్యం చిన్నప్పుడే ప్రవేశించింది. తండ్రి గారి పాటలు, సినిమా పాటలు పాడటం సాగించాడు. పాటలు పాడటంలో మంచిఉత్సాహం చూపాడు. అయితే సంగీతం నేర్చుకోలేదు. చదువు కోవడంతోనే సరిపోయింది. 1963 లోమద్రాస్ లో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు నాటక పోటీలు సంగీతంలో పోటీలు జరిపారు. ఉత్సాహంగల బాలసుబ్రమణ్యం నెల్లూరు నుంచి వచ్చి ఆ పోటీలలో పాల్గొన్నాడు. మొదటి బహుమతి వచ్చింది. ఆ ఆ పోటీకి న్యాయనిర్ణేతలు పెండ్యాల, ఘంటసాల, సుసర్ల.
ప్రేక్షకుల్లో కూర్చుని బాల సుబ్రహ్మణ్యం పాట విన్న సంగీత దర్శకుడు కోదండపాణికి అతని గొంతు బాగా నచ్చింది. ‘నీ పాట పాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. నీ చేత నేను చిత్రాల్లో పాడిస్తాను అయితే ఇప్పుడు నీ గొంతు మరీ లేతగా ఉంది’,అని చెప్పి అతన్ని అభినందించాడు.కోదండపాణి కి అతని గొంతు ఎంత బాగా నచ్చిందో బాలసుబ్రహ్మణ్యానికి అంతకంటే బాగా నచ్చింది. తన గొంతు ఎప్పుడు కాస్త ‘ముదిరితే’ అప్పుడు వెళ్లి కోదండపాణిని కలవాలని అనుకున్నాడు. అక్కడి నుంచి తన గాత్రం మీద శ్రద్ధ తీసుకున్నాడు. బాలసుబ్రమణ్యం సొంత ఊరు నెల్లూరే అయినా అతను మద్రాసులో ఎఐ ఎం ఇ చదవడం వల్ల కోదండ పాణిగారిని అపుడపుడు చూడడారిని అవకాశం కలిగింది. కోదండపాణి బాలసుబ్రమణ్యానికి కబురు చేసి పద్మనాభానికి,ఆ పాట పాట వినిపించాడు పద్మనాభానికి అతని గొంతు బాగా నచ్చింది. కొత్త వారిని ప్రోత్సహించాలన్న గట్టి నమ్మకం గల పద్మనాభం వారం తర్వాత బాల సుబ్రహ్మణ్యాన్ని పిలిపించి, పాట ఇచ్చాడు. ఆ పాటే ‘మర్యాద రామన్న’లో అతను శోభన్ బాబుకు పాడిన ‘ఏమి ఈ వింత మోహం’ అన్న పాట. బాలసుబ్రహ్మాణ్యానికి ప్రారంభంలోనే మరో మంచి అవకాశం కూడా కలిగింది- సుశీల,శ్రీనివాస్, రఘురామయ్య పరిచయం కలగడం, వారితోకలసి పాడటం. తర్వాత దర్భార్ లో పద్మనాభం ముసలి పాత్రలో చదివిన ‘విశ్వము కంటెను విపులమైనది ఏది?’ అన్న పద్యాన్ని కూడా బాలసుబ్రహ్మణ్యం పాడాడు.అతని పాటను మెచ్చకున్న వాళ్లు, పద్యాన్నీ మెచ్చుకున్నారు. ఇలా బాలు తన జీవితాన్ని స రి గ మ ప ద ని స లతో నిన్న మొన్నటివరకు నెట్టుకుంటూ వచ్చారు. జోహార్...జోహార్...జోహార్...బాలు సార్.