మాఫియా డాన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్....??

GVK Writings
రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆర్. ఆర్.ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య దాదాపు రూ. 450 కోట్ల కు పైగా భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీలో మరొక నటుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు చరణ్ పాత్ర యొక్క ఇంట్రడక్షన్ వీడియోలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీని అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్న సినిమా లో ఎన్టీఆర్ నటించనున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. వచ్చే ఏడాది బిగినింగ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న ట్లు సమాచారం. ఇక దీని అనంతరం కేజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నట్లుగా కొద్ది రోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా కథని ఆల్మోస్ట్ సిద్ధం చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని ఎన్టీఆర్ కు వినిపించిన అనంతరం ఎంతో భారీ ఎత్తున గ్రాండ్ లెవల్లో తెరకెక్కించనున్నాడని అంటున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా భారీ స్థాయి యాక్షన్ సీన్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పలువురు టాప్ టెక్నీషియన్స్ పనిచేయనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా ఒక స్టార్ నటి నటిస్తున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్ మొదలెట్టి 2022 సమ్మర్ లో దీనిని రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్త అని చెప్పవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: