
డ్రగ్స్ కేసులో హీరోయిన్ల పై వస్తున్న వార్తలకు తీవ్రంగా మండిపడిపోతున్న నగ్మా...
దీపికా పడుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, దియా, నమ్రత శిరోద్కర్ వంటి వారు కూడా ఈ రాకెట్లో ఉన్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ వార్తల పై సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మా మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. “గతంలో నేను కూడా డ్రగ్స్ వాడానంటూ హీరోయిన్ కంగనా రనౌత్ డైరెక్ట్ గా చెప్పింది.. మరి ఆమెకు అధికారులు ఎందుకు నోటీసులు పంపలేదు.? కేవలం వాట్సప్ మెసేజ్‌లను ఆధారంగా చేసుకుని హీరోయిన్లకు నోటీసులు పంపిస్తున్నారు,మరి కంగనా డైరెక్ట్ గా ఒప్పుకున్నా ఆమెకు ఎందుకు నోటీసులు పంపలేదు.డ్రగ్స్ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో హీరోయిన్లకు సంబంధం ఉన్నా లేకపోయినా నేషనల్ మీడియాలో వారి గురించి వార్తలు వచ్చేలా చేసి వారి పరువు తీయడమే ఎన్.సి.బి అధికారుల ఉద్యోగమా? ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు” అంటూ నగ్మా పెద్ద ఎత్తున మండిపడింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ పై పలువురు నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.