మక్కికి మక్కి దించి  ..... ముక్క తిట్లు తిన్న యువ డైరెక్టర్ .....??

GVK Writings
గత ఏడాది తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమాలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నప్పటికీ మూవీ కేవలం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఆచార్య. వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్స్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. మెగాస్టార్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని అనంతరం ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నారు.

అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న ఒక యువ దర్శకుడు, ఇటీవల ఆ స్క్రిప్ట్ ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొద్దిపాటి మార్పులు చేసి చిరంజీవి, చరణ్ లకు వినిపించాడని, అయితే అతడు చేసిన మార్పులు వారికి పెద్దగా నచ్చలేదని సమాచారం. ఒకరకంగా అతడు చెప్పిన మార్పులు అంతగా ఆకట్టుకునే విధంగా లేవని, అదీకాక అసలు మాతృకనే దాదాపుగా ఉన్నది ఉన్నట్లుగా అతడు వివరించడంతో దానిపై మెగాస్టార్ కొంత చికాకుపడ్డట్లు చెప్తున్నారు. అందువలనే ఆ స్క్రిప్ట్ అతడి నుండి మరొక దర్శకుడికి చేతికి ఇటీవల మారిందని అంటున్నారు. అయితే ఈ సినిమా నిజంగానే మరొక దర్శకుడి చేతికి మారిందా లేదా అనే దానిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: