సమంత మంచు లక్ష్మి ల షాకింగ్ పోస్టులు... ఏముంది వాటిలో...?

VAMSI
టాలీవుడ్ అందాల హీరోయిన్, అక్కినేని ఇంటివారి క్యూట్ కోడలు, నాగచైతన్య మనసు దోచిన యువరాణి సమంత అక్కినేని.. మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మిని సర్‌ప్రైజ్‌ చేశారు. మరి సమంత ఏ విధంగా సర్ ప్రైజ్ చే చేశారో  మన ఏపీహెరాల్డ్ తెలుసుకుందాం.తన స్నేహితురాలు, డిజైనర్‌ శిల్పా రెడ్డితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. ఎన్నో ముచ్చట్లు తో  సరదాగా గడిపారు. ముఖ్యంగా మొక్కలు, కూరగాయల పెంపకం గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని.. ‘గ్రో విత్‌ మి’ ఛాలెంజ్‌కు పిలుపునిచ్చారు ఈ బడా స్నేహితులు.ఇందులో మంచు లక్ష్మితోపాటు అనేక మంది పాల్గొన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఇంటికి వెళ్లిన శ్యామ్ ఆమెకు గార్డెనింగ్‌లో మెళకువలు నేర్పించడం విశేషం.


‘అందమైన సమంత, శిల్పారెడ్డితో సూపర్‌ ఫన్‌ గార్డెనింగ్‌ సెషన్‌, మీ సర్‌ప్రైజ్‌కు థాంక్యూ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది మంచు లక్ష్మి. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ సడన్ గా ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేసి, మాతో కలిసి భోజనం కూడా చేశారు. ఇప్పుడు వారిని చాలా మిస్‌ అవుతున్నా. ఇలాంటి అకస్మాత్తు లంచ్‌లు మరిన్ని జరిగేలా ప్లాన్‌ చెయ్యాలి. మా స్నేహాన్ని మరింత అందమైన తీపి జ్ఞాపకాలతో నింపాలి.... అంటూ వ్యక్తపరిచారు మంచు లక్ష్మి. ఇక క్యూట్‌ సమంత నా ఫ్రిడ్జ్‌ను అందంగా తయారు చేయడానికి ఎంతో సహాయపడింది. ఇలా మళ్లీ మనం విలువైన సమయాన్ని గడపాలి’ అంటూ మంచు లక్ష్మి వారు దిగిన ఫొటోలు షేర్‌ చేశారు. దీనికి స్పందించిన సమంత.. ‘వావ్’ అని కామెంట్‌ చేశారు.

లాక్ డౌన్ లో ఇంట్లోనే కూరగాయలు, దుంపల్ని పెంచుతున్న సమంత. వీటి పెంపకం గురించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని.. రుచికరంగా ఆహారం చేయడం నేర్చుకున్నారు. ఇలాగే అందరూ గార్డెనింగ్ చేసి... సొంతంగా పండించిన కూరగాయలతో వంటలు చేస్తే ఆ ఆనందం చెప్పలేనంతది అంటూ పేర్కొన్నారు. మొక్కల పెంపకంలో సందేహాలు అడిగిన ఫాలోవర్స్‌కు సమాధానాలు ఇస్తూ.. ఒక ప్రత్యేక వీడియో కూడా షేర్ చేశారు సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: