పవన్ తో యుద్ధానికి సై అంటున్న రాఖీ భాయ్ ....??
దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వచ్సితుండగా పవన్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా ని వచ్చే ఏడాది సంకాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెండేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా కెజిఎఫ్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా యువ నటుడు యాష్ హీరోగా నటించారు.
ఇక కొన్నాళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాలని ఆ మూవీ యూనిట్ ప్రయత్నిస్తోందట. ఆ విధంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు పోటీగా రాక్ స్టార్ యాష్ నటిస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తలు కనుక నిజమే అయితే, రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భీకర పోరు ఖాయం అనే చెప్పాలి ...!!