అబ్బా .... ఆయన ప్రక్కన.... ఆమె అయితేనే కరెక్ట్ అంటున్న త్రివిక్రమ్ ....??

GVK Writings
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో సక్సెస్ అందుకున్న శ్రీనివాస్, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా  తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.  
ఇక ఈ సినిమా అనంతరం అతి త్వరలో మరొక్కసారి టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్న ఒక సినిమాని తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ అది పూర్తయిన తరువాత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. కాగా ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మంచి పొలిటికల్ సెటైరికల్ మూవీగా పలు కమర్షియల్ హంగులతో తన మార్క్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించనునట్లు టాక్. ఇక దీని అనంతరం టాలీవుడ్  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా తెరకెక్కించనున్నట్లు మరొక వార్త కూడా కొన్నాళ్లుగా వైరల్ అవుతోంది.
కొద్దిరోజుల క్రితం మహేష్ బాబుని తన స్వగృహంలో కలిసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ చెప్పటం అది ఎంతో నచ్చిన మహేష్ బాబు, అతి త్వరలో దీనిని సెట్స్ మీదకు తీసుకువెళదాం అంటూ మాటివ్వడం జరిగిందని అంటున్నారు. మంచి కమర్షియల్ హంగులతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద సక్సెస్ అయ్యేలా త్రివిక్రమ్ తీయనున్నట్లు చెబుతున్నారు. అలానే ఈ సినిమా ద్వారా మహేష్ కు జోడీగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ని నటింపజేయాలని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నారట. మహేష్ బాబు వంటి  హ్యాండ్సమ్ హీరోకి జోడిగా ఇందులోని పాత్రకు హీరోయిన్ గా శ్రద్ధ అయితేనే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్ ఎట్టి పరిస్థితుల్లో ఆమె తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం సాహో తర్వాత మరొక్కసారి శ్రద్ధ నటించబోయే తెలుగు సినిమా ఇదే అవుతుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: